మెక్సికోలో భారీ పేలుడు: ముగ్గురు మృతి

మెక్సికో : మెక్సికోలోని తీర రాష్ట్రం వెరాక్రూజ్లో పెట్రో కెమికల్ ప్లాంట్లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 88 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం బుధవారం చోటు చేసుకుంది.