Thursday, 5 November 2026

అస్సోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు

 

 

 

 

 

మెట్ పల్లి జనంసాక్షి

కాంగ్రెస్పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా lకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ తండ్రి కుమారుడంటూ తాము ఎప్పుడైనా అడిగామా అని అస్సోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సోం ముఖ్యమంత్రి హిమంత మూర్ఖంగా చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఒక సీఎం హోదాలో ఉన్న హిమంత.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరో తెలియనంత మూర్ఖుడా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి, ఆ పార్టీకి చెందిన అసోం సీఎంకూ లేదన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం తన ఆస్తులనే త్యాగం చేసిందని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన చరిత్ర పండిట్ నెహ్రూదని ఇది గుర్తుంచుకోవాలన్నారు. ఇందిరాగాంధీ.. బాల్యంలోనే ఐదారేళ్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. దేశం కోసం ప్రధాని హోదాలో ఇందిర, రాజీవ్ గాంధీలు అమరులయ్యారన్నారు. ఇదీ రాహుల్ గాంధీ కుటుంబం చరిత్ర అని వివరించారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో బీజేపీ ఎక్కడుందని..? అసోం సీఎం ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా స్వాతంత్ర ఉద్యమ సమయంలో పుట్టినవారు కాదన్నారు. వాజ్ పేయి అడ్వాణీ మినహా ఇప్పుడున్న బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఎవరూ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో పుట్టినవాళ్లు కాదని పేర్కొన్నారు. ఎలాంటి చరిత్రా లేని అసోం సీఎం.. రాహుల్ కుటుంబం గురించి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ప్రపంచ దేశాలకూ.. ఈ తరానికి కూడా గాంధీ కుటుంబం గురించి, నెహ్రూ నుంచి ఇందిర, రాజీవ్, రాహుల్ గాంధీల వరకూ తెలుసునన్నారు. దేశంలోని చదువు రాని వారికీ గాంధీ కుటుంబం గురించి తెలుసునన్నారు. “చదువు, తెలివి ఉండీ.. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మూర్ఖుడికి రాజీవ్ గాంధీ గురించి తెలియదా? అవమానంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. హిమంత లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని బీజేపీ సమర్ధిస్తుందంటే.. ఆ పార్టీ నేతలంత మూర్ఖులు ఎవరూ ఉండరని విమర్శించారు. ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని, లేనిపక్షంలో దీనికి తగ్గట్లుగా తామూ మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం త్యాగం చేసి స్వాతంత్ర్యం తీసుకురావడం వల్లే బీజేపీ వాళ్లూ సీఎంలు అయ్యారని, ఇలాంటి మాటలు మాట్లాడి వారు దిగజారొద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ అలీమ్ కిరణ్ మొహమ్మద్ రహీం ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారుతేదీ:14-02-2022.