Tuesday, 3 November 2026

మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన మెడికో సీనియర్ విద్యార్థి సైఫ్ ను వెంటనే ఉరితీయాలి

రఘునాథ పాలెం మార్చి 02(జనం సాక్షి)
మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన మెడికో సీనియర్ విద్యార్థి సైఫ్ ను వెంటనే ఉరితీయాలని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ డిమాండ్ చేశారు  స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన సమావేశంలో  పాల్గొని మాట్లాడుతూ మెడికో పీజీ జూనియర్ విద్యార్థిని ప్రీతి పై మెడికో సీనియర్ విద్యార్థి సైఫ్  వేధించడం వల్లే ప్రీతి మరణించిందని ప్రీతి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదు హత్యగా భావిస్తున్నారని ఆ వైపున దర్యాప్తు చేయాలని  డిమాండ్ చేశారు  ప్రీతి పై వేధింపుల కు గురి చేస్తున్న మేడికో విద్యార్థి సైప్ పై చర్యలు తీసుకోవడంలో కేఎంసీ ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం నిర్లక్ష్యంగా వ్యవహరించారని లింగాల మండిపడ్డారు మెడికో విద్యార్థిని ప్రీతి మరణం పై సత్వరమే న్యాయ విచారణ జరిపి సైఫ్ కు ఉరిశిక్ష వేయాలని ప్రీతి కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల హస్సేన్ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంతెటి వీరభద్రం మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షులు గిడ్ల పరంజ్యోతి మేకతోటి కాంతయ్య బీసీ నేత పెరుగు వెంకటరమణ గిరిజన నాయకుడు భూక్య నాగరాజు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కొట్టే సుధాకర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర గంగాధర్ దాసరి శ్రీనివాస్ తదితరులు డిమాండ్ చేశారు