Tuesday, 3 November 2026

మెదక్‌ చర్చిని సందర్శంచిన ముఖ్యమంత్రి

మెదక్‌: ఆసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్‌ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సందర్శిచారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత గురువుల  ఆశీస్సులను పొందారు. చర్చి ప్రాముఖ్యతను మత గురువులు ఆయనకు వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు డీకె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, పితాని సత్య నారాయణ, ఎమ్మెల్యేలు హనుమంతరావు, నర్సారెడ్డి తదితరులు చర్చిని సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *