Wednesday, 4 November 2026

మెదక్‌ జిల్లాలో మహిళపై ఆత్యాచారం

మెదక్‌ : జిల్లాలోని కొండపాక మందలం మాటుపల్లి గ్రామంలో బుధవారం ఆర్థరాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సిద్ధిపేట నుంచి వస్తూ మాటుపల్లి స్టేజి వద్ద దిగి తన ఇంటికి నడిచి వేళ్తున్న ఓ వివహిత (24)ను మిదినీపూర్‌ గ్రామానికి లష్కర్‌ కొండస్వామి (30) తాను ఇంటి వద్ద దించి వస్తానని చెప్పిబైక్‌ పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో మాటుపల్లి శివారు వద్ద ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గ్రామానికి చేరుకుని స్థానికులకు విషయం తెలపడంతో గ్రామాస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. మాటుపల్లి గ్రామానికి కుక్కునూరుపల్లి ఎస్సై బాల్‌రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసుకొని బాధితురాలిని వైద్యపరీక్షల కోసం సిద్ధిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కొండస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *