మెదక్ లో వైభవంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

జనం సాక్షి ప్రతినిధి మెదక్
అన్ని వర్గాల వారిని సమైక్యం చేయాలనే సంకల్పంతో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.
జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి ప్రభుత్వ బాలుర కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా తెరాస పార్టీఅధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ బతుకమ్మ, బోనాలు, డప్పు చప్పులు, పీర్లతో అంగరంగ వైభవంగా కొనసాగింది,
ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు, జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. అందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని 14 సంవత్సరాలు పోరాటం చేశారని గుర్తు చేశారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఈరోజు మనం
గొప్పగా బతుకమ్మ , క్రిస్టమస్, రంజాన్ వంటి
పండుగలు జరుపుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతులకు ఉచిత కరెంటు, ఇంటింటికీ మంచినీళ్ల పథకం, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నట్టు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రం వచ్చిందని, ఆలాగే మెదక్ కు రైలు కూడా వచ్చిందని అన్నారు. రాబోయే కాలంలో మెడికల్ కాలేజ్ కూడా వస్తుందని అన్నారు.
త్వరలో సొంత స్టలం ఉన్నవారికి డబల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం మూడు లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు. అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చామని మరో 500 కూడా ఇస్తామని తెలిపారు.. ఆగస్టు 15 , జూన్ 2 జెండా ఎగరేసుకున్నామని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని, ఇప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు మహిళా సంఘాలు పాల్గొన్నారు.