Tuesday, 3 November 2026

మేడే ఉత్సవాల్లో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఐటీ పరిశ్రమలు వచ్చాక చాలా పరిశ్రమలు వచ్చాయని, పరిణామాక్రమాన్ని పసిగడితే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఆటో రిక్షాలపై రవాణా పన్ను రద్దు చేశామని, అంతకుముందు బకాయిలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి భృతి కల్పించినట్లు గుర్తు చేశారు. తెలంగాణలోని డ్రైవర్లకు రూ.5లక్షలతో ప్రమాద బీమా కల్పించనున్నట్లు, ఈ రోజు నుండి వర్తిస్తుందన్నారు. అలాగే రూ.5లక్షల ప్రమాద బీమా హోంగార్డులకు, జర్నలిస్టులకు వర్తిస్తుందన్నారు. ప్రసూతి సమయంలో చేసే ఆర్థిక సహాయం రూ.10 వేల నుండి రూ.20వేలకు పెంపు చేస్తున్నట్లు తెలిపారు. సహజ మరణం పొందిన వారి కార్మిక కుటుంబాలకు ఇచ్చే రూ.30 వేల నుండి రూ.60వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రమాదంలో మరణించే కార్మిక కుటుంబసభ్యులకు ఇచ్చే సహాయం రూ. 2 లక్షల నుండి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. శ్రామిక్ యోజన ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *