మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామాలను సుందరంగా తీర్చి దిద్దుతున్నాం : మంత్రి మల్లారెడ్డి
శామీర్ పేట్, జనం సాక్షి :
ముడుచింతలపల్లి మండలంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి 17 చెక్కులను లబ్ధిదారులను మంత్రి మల్లారెడ్డి పంపిణి చేశారు.
ముడుచింతలపల్లి మండలంలోని జగన్ గూడ, కొల్తూరు, నారాయణ పూర్, పోతారాం, ఉద్దేమర్రి గ్రామలలో పర్యటన భాగంగా పాదయాత్ర చేశారు.
స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు
గ్రామలలో అసంపూర్తిగా ఉన్న గుడులు మరియు రోడ్డులేని చోట సొంత నిధులతో సీసీ రోడ్డులు నిర్మాణం చేస్తున్నామన్నారు
హామీ ఇచ్చిన పనులను రేపటి నుండి ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి,ఎంపీపీ హారిక మురళి గౌడ్,డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏ ఎం సి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
10ఎస్పీటీ -2: చెక్ లు అంద జేస్తున్న మంత్రి మల్లారెడ్డి