మార్పులు చేసిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 7 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల నిర్వహణపై వీసీలు, కన్వీనర్లతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సమావేశమయ్యారు. వారితో చర్చించి కొన్ని మార్పులు చేశారు. మే 26కు బదులు మే 20న లాసెట్ పరీక్ష జరగనుంది. అలాగే మే 28 నుంచి మే 31 వరకు పీజీ ఈసెట్ మార్చబడింది. ఎడ్‌సెట్ రెండు రోజులు కాకుండా ఒకే రోజు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పాపిరెడ్డి స్పష్టం చేశారు.




