Tuesday, 3 November 2026

స్కాన్‌ కోసం వచ్చిన మహిళపట్ల అసభ్య ప్రవర్తన

కేసునమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): హుమాయున్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. సిటిస్కాన్‌ కోసం వచ్చిన మహిళ పట్ల ల్యాబ్‌ టెక్నీషియన్‌ వీరబాబు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి కేకలతో వీరబాబును బంధువులు, రోగులు చితకబాదారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ వీరబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయనగర్‌ కాలనీలోని విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.