ఘటనపై ఆరా.. దర్యాప్తు వేగం చేయాలని ఆదేశం
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): నగరంలోని పాతబస్తీ కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర ¬ంమంత్రి మహముద్ అలీ సిరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. అత్యాచారం ఘటనకు సంబంధించి కేసు వివరాలను సీపీ అంజనీ కుమార్‌ను అడిగితెలుసుకున్నారు. ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మహముద్ అలీ ఆదేశించారు. బాలిక వయసు పదహారేళ్లు! రెండేళ్లుగా ఆ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. 11మంది యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. మరీ ఘోరం ఏమిటంటే.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఆ బాలిక సవిూప బంధువే! ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడు సహా ముగ్గురినే పోలీసులు అరెస్టు చేశారు. బాలికపై అఘాయిత్యం చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేయకుండా సాక్షిగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ కామాటిపురలో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో చాలామంది బయటే తిరుగుతున్నారని పోలీసులపై ఆదివారం బాధిత బాలిక బంధువులు ఆగ్రహించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు.




