Monday, 2 November 2026

మైనర్ బాలికపై నాలుగు నెలలుగా రేప్

నిజామాబాద్/ హైదరాబాద్: ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా ఇద్దరు కిరాతరకులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మంగళవారం వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకువచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలం నల్లూరు గ్రామానికి చెందిన పదిహేను సంవత్సరాల బాలిక బుస్సాపూర్ హైస్కూల్‌లో 7వతరగతి చదువుతోంది. ఆ బాలికకు వరుసకు బావ అయిన రేపుల రాజు, అతని స్నేహితుడు బలరాంలు కలిసి ఆ బాలికను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని పాఠశాలలో దించుతామంటూ నమ్మబలికి మార్గమధ్యలోని పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన పురాతన భవనంలోకి తీసుకెళ్లి తమ వాంఛ తీర్చుకునేవారు. ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు బాలికను నిలదీయగా అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో రాజు, బలరాంలపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసునమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *