Wednesday, 4 November 2026

మైల రగోతమ్మ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

–ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య.

 మంగపేట,ఆగస్టు 27 (జనంసాక్షి):-
మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామనికి చెందిన సీనియర్ నాయకులు మైల రగొత్తమ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ విండో డైరెక్టర్ గా, 12 సంవత్సరాలు మండల ఉపాధ్యక్షులుగా పని చేసారు.  పలు వివిధ పదవులతో పార్టీ కి వన్నె తెచ్చేవిధంగా క్రమశిక్షణ తో పని చేశారు,అని ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన భౌతికాయనికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి శవయాత్ర లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనగని రామచంద్రబాబు,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మైబూబ్ ఖాన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిడైతుల్లా, మంగపేట మండల సోషల్ మీడియా ఇంఛార్జి కర్రీ నాగేంద్రబాబు, సీనియర్ నాయకులు ధమేరా సారయ్య,   హుస్సేన్ ఖాన్, గంజి కృష్ణారెడ్డి, కారుపోతుల నర్సయ్య, మసిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.