మైసమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది
వేములవాడ, ఆగస్టు 13 (జనం సాక్షి) : వేములవాడ శివార్లో ఉన్న పిల్లిగుండ్ల మైసమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. నిర్వాహకురాలు మల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం రోజువారి పనిలో భాగంగా ఉదయం ఆలయం కి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉందని ఆలయంలో ఉన్న మూడు పెద్ద గంటలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు చోరీ జరిగినట్లు పేర్కొన్నారు.ఆలయానికి రక్షణ కల్పించేలా కనీస చర్యలు తీసుకోవాలని కోరారు.