Tuesday, 3 November 2026

మొక్కలు నాటి సంరక్షించాల్సిందే: జడ్పీ చైర్‌పర్సన్‌

గద్వాల,జూలై22 (జ‌నంసాక్షి):  హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి రాష్ట్రాన్ని  హరిత తెలంగాణగా మార్చాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత అన్నారు. రాజోలి మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామంలో సర్పంచి శేషమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహాంతోపాటు ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలను నాటడంతోపాటు తప్పనిసరిగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, తెరాస పార్టీ ప్రధాన నాయకులు పాల్గొన్నారు.