అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 5
అంతరించిన అడవి సంపదను పెంచాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం ను ప్రతిష్టాత్మకంగా ప్రజల ముందుకు తెచ్చారని మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ పేర్కొన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ అంబేద్కర్ నగర్ అయ్యప్ప నగర్ లో డ్వాక్రా గ్రూప్ సహకారంతో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన కార్పొరేటర్ ఈ సందర్భంగావారుమాట్లాడుతూ
డివిజన్ వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అడవి విస్తీర్ణం పెరిగి పట్టణాల్లో కూడా పచ్చదనం కూడా పరుచుకుందన్నారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం కాబట్టి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే మొక్కలను విరివిగా పెంచాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, అల్వాల్ సర్కిల్ మహిళ అధ్యక్షురాలు జ్యోతి యాదవ్, శ్రావణ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, ఢిల్లీ పరమేష్, సుభాష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కొండల్ రెడ్డి, సురేష్, మహిళ సభ్యులు సువర్ణ,అన్నపూర్ణ, గీత, భాగ్యలక్ష్మి, కవిత,తదితరులు పాల్గొన్నారు.
Attachments area




