మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలి
పిల్లలమర్రిలో వృక్షా బంధన్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): విద్యార్థి దశ నుండే మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని సిజీఆర్ వాలంటీర్ రాపర్తి మహేష్ కుమార్ అన్నారు.గురువారం
మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో వృక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు, వృక్షాలకు రాఖీ కట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలతో మానవతా సంబంధాన్ని కొనసాగిస్తూ, పుట్టినరోజున మొక్కను నాటడం అలవాటు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ హెచ్ఏం తూము శ్రీనివాస రావు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్, వేణు, సైదా నాయక్, సిజీఆర్ వాలింటీర్స్ దాసరి శంకర్ , నజీర్, తూటిపల్లి మహేష్ , మున్నా , ఉపేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.