కనకదుర్గ ఆలయంలో పూజలుచేసిన నేతలు
హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ నేత కె.లక్ష్మణ్ యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన యాత్ర నేపథ్యంలో బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మ వారికి లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్‌తో చేతులు కలపడం వల్లనే కేసీఆర్ విమోచన దినం నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్‌ను నెత్తిన ఎత్తుకుని కేసీఆర్ ఉరేగుతున్నారన్నారు. లక్ష్మణ్ చేపడుతున్న తెలంగాణ విమోచన యాత్రకు అందరు కలిసిరావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ విమోచన యాత్రను శుక్రవారం నుంచి మొదలు పెడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. వారం రోజులపాటు ఈ యాత్ర కొనసాగు తుందని తెలిపారు. రజాకార్ల ఆగడా లకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయని, వాటన్నింటినీ సందర్శించి, ప్రజలకు తెలంగాణ విమోచన ప్రాధాన్యం గురించి వివరిస్తామని చెప్పారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా సీఎం కేసీఆర్ తప్పిం చుకుంటున్నారని విమర్శించారు. ఈ నెల 17ను విమోచన దినోత్సవం నిర్వహించకపోతే నాడు రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్ పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచనను నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




