మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వంగర మండల కేంద్రంలో శుక్రవారం టీ పి సీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన హెరాల్డ్ సి ఏ ఎస్ ఈ ఈ డి అక్రమ కేసులు నమోదు చేయాలని ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ ప్రభుత్వం కుట్ర కుట్ర చేసే క్రమంలో ఉన్నాడు వాటిని రద్దు చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని మండల కేంద్రములో ఎక్స్ రోడ్డు వద్ద ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు తరువాత కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతాడని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిత్యవసర సరుకులకు, గ్యాస్ పెట్రోల్ విపరీతంగా పెరిగాయి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి తెచ్చింది మరో శ్రీలంక లెక్క భారతదేశం కాకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం వస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు హమ్య నాయక్, జిల్లా నాయకులు దుంపల కుమారస్వామి,మండల నాయకులు, ముత్యాల పూర్ణచందర్ అనపురం శ్రీనివాస్,సతీష్, బానోత్ సీతారాం,జగ్గునాయక్,శ్రీను,వేణు, సమ్మయ్య,కరుణాకర్,యకన్న,రాంబాబు అనపురం వినోద్,రాజు,రవి,తదితరులు పాల్గొన్నారు