మోడీ ప్రమాణ స్వీకారానికి జయలలిత

చెన్నై : డిసెంబర్‌ 26న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసే వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకానున్నారు. మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ వేడుకకు హాజరవుతున్నట్లు నేడు వెలువడిన అధికార ప్రకటన పేర్కొంటోంది. జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ హాజరైన సంగతి తెలిసిందే.