హైదరాబాద్, సెప్టెంబరు 19 : ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ నిరసన తెలపడం హాస్యాస్పదం అన్నారు. రైతులకు మేలు చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సుభాష్‌చంద్రబోస్ రహస్య ఫైళ్లను బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టడం హర్షణీయమన్నారు. ఆ ఫైళ్లలో సమాచారాన్ని పరిశీలించాలన్నారు. నేతాజీ మరణంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.




