Tuesday, 3 November 2026

మోసపు మెసేజ్‌లకు స్పందిస్తే అంతే సంగతులు

వ్యూహం మార్చి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న దగాకోరులు

హైదరాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): హైదరాబాద్‌లో సైబర్‌ కైమ్ర్‌ పోలీసుల దాడులు పెరగడంతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. అయినా మోసాలకు మాత్రం ఆగడం లేదు. పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు తమ ఖాతాల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లాటరీ, వివాహాల పేరుతో మోసాలకు గురవుతున్న బాధితులు ఇటీవల సైబర్‌కైమ్ర్‌ పోలీసులను ఆశ్రయించడంతో సమస్యలు మారడం లేదని గుర్తించారు. దీనికి మోసగాళ్లు వ్యూహాలు మార్చి మోసాలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. లాటరీ, వివాహాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న బాధితులు ఇటీవల సైబర్‌కైమ్ర్‌ పోలీసులను ఆశ్రయించడంతో వివరాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన్లో అప్రమత్తంగా లేకపోవడంతో కూడా అకౌంట్లను హ్యాక్‌ చేస్తున్నారు. మెట్రోనగరాల్లో నివసిస్తున్న ప్రజలను మోసం చేసి వారి నుంచి లక్షలు స్వాహా చేస్తున్న నైజీరియన్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈశాన్య రాష్టాల్రను ఎంచుకున్నారు. అక్కడి బ్యాంకుల్లో బినావిూ ఖాతాలను తెరిపించి దోచుకున్న నగదును వీరి ఖాతాల్లోకి మార్పిస్తున్నారు. అక్కడ యువతులను మచ్చిక చేసుకుని వారిపేరుతో ఖాతాలు తెరిపించి, వారికి పదిశాతం కమిషన్‌గా ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు గుర్తించారు. ఒక్కోఖాతాలో కొంత మొత్తం చొప్పున వేయడం, క్షణాల్లో వాటిని దిల్లీకి బదిలీ చేసుకున్నట్టు గుర్తించారు. ఇక నేరస్థులు ఈశాన్య రాష్టాల్రను ఎంచుకుంది వారి సౌలభ్యం కోసమే.. బాధితుల నుంచి దోచుకున్న సొమ్ము రూ.లక్షల్లో ఉన్నా.. పోలీసులు దర్యాప్తుచేసి పట్టుకునేందుకు ఇక్కడికి రావాలంటే కనీసం రూ.20వేలు ఖర్చవుతుందని, ఒకవేళ పోలీసులు వచ్చినా చిరునామాలు స్థానికులవి ఉంటాయి. వారిని అరెస్ట్‌ చేసినా ఉపయోగం ఉండదన్న ముందస్తు ప్రణాళికతో ఇదంతా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ద్వారా బాధితుల నుంచి స్వాహా చేస్తున్న నగదంతా ఈశాన్య రాష్టాల్రు అసోం, మేఘాలయ, మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్టాల్ల్రో వ్యక్తుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసి సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు, బ్యాంకు అధికారులను సంప్రదించేలోపు దిల్లీకి బదిలీ చేసుకుంటున్నారు.. పెద్ద మొత్తాలుంటే ఆయా ఖాతాదారుల ద్వారా విత్‌డ్రా చేయించి మరీ దిల్లీకి తెప్పించుకుంటున్నారు. నగదు విత్‌డ్రా చేసుకున్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద చిరునామాలను సేకరించగా… చిన్న ఆధారం కూడా లభించడంలేదు. నైజీరియన్లు ఎప్పటికప్పుడు హైదరాబాదీయులను మోసం చేసి లక్షలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చిరస్తున్నారు. ఉద్యోగాలు, లాటరీలు, బ హుమానాల పేరుతో వచ్చే మెయిళ్లకు, మెజే/-/-లకు స్పందించవద్దని అన్నారు.