Tuesday, 3 November 2026

స్కూల్‌ ట్రాఫిక్‌ సమస్యలపై చర్చించాలి

హైదరాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): ట్రాఫీక్‌ రద్దీని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నడుం బిగించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ చిక్కలు పెరిగాయి. దీంతో అవగాహన కల్పించేందుకు స్కూల్‌ యాజమాన్యాలకు సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్‌ పాఠాలు చెబుతున్నారు. నగరంలో మొత్తం 3218 ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫీక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అదే విధంగావిద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ట్రాఫిక్‌ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ప్రతి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ వారి సూచనలు, అభిప్రాయాలను తెలిపి వాటిపై చర్చించాలని కోరారు. పౌరుల్లో ఎవరైనా విలువైన సూచనలు చేసినా స్వీకరిస్తామని అన్నారు.