తల్లిదండ్రులూ బహు పరాక్‌

 

పిల్లల విషయంలో జాగ్రత్తలు అవసరమే

న్యూఢిల్లీ,జూన్‌28(జ‌నం సాక్షి):స్కూల్‌ లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం. ఇది డిల్లీ లోని ఒక స్కూల్‌ లో జరిగిన సంఘటన ఒక ఎనిమిది సంవత్సరాల ఈ అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్‌ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది. కానీ ఒకరోజు ట్రాఫిక్‌ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్‌ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్‌ గేట్‌ బయట వేచి చూస్తూ ఉంది.దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి , ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ‘ విూ అమ్మకు వేరే అర్జంట్‌ వర్క్‌ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్‌ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది ‘ అని ఆ అమ్మాయితో చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి , ‘ సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని , నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్‌ వర్డ్‌ చెప్పు ‘ అని అడిగింది.వాడికేవిూ అర్థం కాలేదు. అటూ ఇటూ చూసి తడబడ్డాడు. ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై , గట్టిగా అరిచేలోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి స్కూల్‌ పిల్లల కిడ్నాప్‌ లు ఎక్కువగా జరుగుతుండటంతో, ఆ అమ్మాయి తల్లి , తన కూతురికి ఒక పాస్‌ వర్డ్‌ ను చెప్పింది.స్కూల్‌ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే వాళ్ళను ఆ పాస్‌ వర్డ్‌ ను అడగమని చెప్పింది. అప్పుడు ఆ పాస్‌ వర్డ్‌ వాళ్ళు చెప్పలేకపోతే కిడ్నాపర్‌ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల ఆ అమ్మాయికిడ్నాపర్‌ ల బారి నుండి తప్పించుకోగలిగింది.తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ పాస్‌ వర్డ్‌ విధానాన్ని పాటిస్తేచాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు. ఇప్పుడీ విషయం సోషల్‌ వైరల్‌గా ప్రచారం సాగుతోంది.

————–