Wednesday, 4 November 2026

మౌనదీక్షతో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

చౌడాపూర్, జులై 29( జనం సాక్షి):గత అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హత కలిగిన వీఆర్ఏలను వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని,55 ఏళ్లు నిండిన వీఆర్ఏల యొక్క వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలోని  తహసిల్దార్  కార్యాలయం ఎదుట వీఆర్ఏలు మౌన దీక్షతో ఐదవ రోజు నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది.మా యొక్క డిమాండ్లను ప్రభుత్వం వెంబడే స్పందించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరాసన  కార్యక్రమాలు చేపడతామని వీఆర్ఏల సంఘం కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య,జగన్, రమేష్, కేశవులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Attachments area