మళ్లీ విధుల్లోకి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
ముస్తాబాద్ ఆగస్టు 10 జనం సాక్షి
హైదరాబాద్ రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో పని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు నిర్వర్తించనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నా, కాశోల్ల దుర్గ ప్రసాద్ ,మున్నా ,ఎల్లం ,శ్రావణ్ ,డేవిడ్, పరశురాములు కనకయ్య ,రేఖ