యాచారంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని యాచారం మండల కేంద్రం లో బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి అతను దేశానికీ, సమాజానికి చేసిన సేవను గుర్తు చేసుకుంటూ, ఈరోజు బిజెపి ఎదుగుదలలో అతని పాత్ర ఎంతో ఉంది అని కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు దన్నే బాషయ్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పురుషోత్తం, బిజెపి సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఈశ్వర్, రమేష్, నర్సింహా,  సంతోష్ గుప్త, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు గడ్డం దయాకర్, బీజేవైఎం కార్యదర్శి బన్నే శివ, నక్క సోమేశ్ కుమార్, నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు