యాదగిరిని సన్మానించిన గవర్నర్

జుక్కల్, సెప్టెంబర్13,జనంసాక్షి,
జాతీయ బిసి సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి యాదగిరి పిట్లం సామాజిక సేవలను గుర్తించి మంగళవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సన్మానించారు. ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతు పిట్లం మండలంలోని టిబి పేషంట్లకు బియ్యం పంపిణీ తదితర కార్యక్రమాలను చేపట్టినందుకు గవర్నర్ కార్యాలయానికి పిలిపించి సన్మానించారని తెలిపారు. గవర్నర్ లాంటి గొప్ప వ్యక్తులు తన సేవలను గుర్తించడం సంతోషంగా ఉందని తెలిపారు. తన జీవితాంతం ప్రజాసేవచేయాలన్న ఉత్సాహం కలిగిందని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.