హైదరాబాద్ : శ్రీనగర్ ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లికి వెళ్లి యాదయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తారని పార్టీ నేతలు తెలిపారు.




