యాదవుల సంక్షేమానికి పెద్ద పీట
◆◆◆◆ కుల వృత్తులకు ప్రోత్సాహం
◆◆◆ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు
మానకొండూరు, ఆర్ సి, డిసెంబర్ 24( జనం సాక్షి)
యాదవుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీ.వి రామకృష్ణరావు అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిదిలోని 8వ డివిజన్ అలుగునూరులో శనివారం ‘ది కరీంనగర్ పట్టణ యాదవ సొసైటీ’ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను జీవి రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు, సంఘ న్యాయ సలహాదారులు న్యాయవాది జంగ శ్రీనివాస్ యాదవ్ జీవి రామకృష్ణారావుకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు, క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ నూతన పథకాలను తీసుకువచ్చారని, అందులో భాగంగా యాదవుల సంక్షేమానికి గొర్రెల పంపిణీ కార్యక్రమం తో పాటు,పలు పథకాలను రూపొందించారని తెలిపారు. యాదవులు అన్ని రంగాల్లో ముందుండాలని, గ్రామాలలో యాదవులు మంచి వ్యక్తిత్వంతో, కలివిడిగా ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాసరెడ్డి ,నాయకులు సల్ల రవీందర్, కంది రాంచందర్ రెడ్డి, యాదవ సొసైటీ జిల్లా అధ్యక్షులు సందబోయిన ప్రసాద్ యాదవ్,ఉపాధ్యక్షులు బండ వేణు యాదవ్ ,ప్రధాన కార్యదర్శి జంగ కొమురయ్య యాదవ్, కార్యదర్శి గాదం శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్ ముక్కెర ప్రణయ్ యాదవ్ తో పాటు అలుగునూరు 8వ డివిజన్ అధ్యక్షులు వేల్పుల కొమురయ్య, చౌదరి పర్శరాములు, యాదవ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





