Thursday, 5 November 2026

యాదా శ్రీకాంత్ కు డాక్టరేట్ ప్రధానం

వరంగల్ ఈస్ట్, మే 19 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని ఎల్లం బజార్ ప్రాంతానికి చెందిన యాదాశ్రీకాంత్ కు ఉస్మానియా యూనివర్సిటీ వారు కామర్స్ విభాగంలో డాక్టరేట్ అందించారు. శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఏ కంపారిటివ్ స్టడీ అనే అంశంపై పరిశోధన చేసినందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ను ప్రధానం చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు అయితే ఇతనికి గైడ్ గా డాక్టర్ కమటం శ్రీనివాస్ వ్యవహరించారు. శ్రీకాంత్ డాక్టరేట్ వచ్చినందుకు స్నేహితులు బంధువులు అభినందనలు తెలిపారు