Tuesday, 3 November 2026

యాసం రాజుకు తుడుందెబ్బతో సంబంధం లేదు. – తుడుం దెబ్బ ములుగు జిల్లా ఉపాద్యక్షులు చింత సోమరాజు.

 

 

 

 

 

 

నూగూరు వెంకటాపురం,మే30(జనంసాక్షి):- వెంకటాపురంమండల కేంద్రంలో తుడుందెబ్బ అత్యవసర సమావేశం జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో తుడుం దెబ్బ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు పాల్గొని మాట్లాడారు.గత కొంత కాలంగా తుడుం దెబ్బ సంఘానికి యాసం రాజుకు ఎటువంటి సంబంధం లేదన్నారు.పూజారి గూడెం గ్రామ సభ నిర్వహించాలని తుడుం దెబ్బ సంఘం పేరుతో పత్రిక ప్రకటన ఇచ్చిన యాసం రాజు కు తుడుం దెబ్బ సంఘానికి ఎటువంటి సంబంధంలేదని పత్రికా ముఖంగా తెలిపారు. సంఘ సిద్ధాంతాలను పక్కన పెట్టి,తన స్వలాభం కోసం ,కమర్షియల్ వ్యాపారాలకు అలవాటుపడి గిరిజనేతరులకు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతునందున తుడుందెబ్బ యాసం రాజును పక్కకు పెట్టిందని అన్నారు.ఆదివాసీ ప్రజలు,మేధావులు గ్రహించాలని సూసించారు.ఈ కార్యక్రమాల్లో ములుగు జిల్లా నాయకులు కుచ్చిoటి చిరంజీవి,డివిజన్ అధ్యక్షులు సిద్దబోయిన సర్వేష్,కణితి వెంకటకృష్ణ, కణితి ప్రశాంత్,బొగ్గుల విష్ణు మూర్తి,పూనేం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.