హైదరాబాద్,మే15(జనం సాక్షి): జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద యాసిడ్ దాడి ఘటన నిందితుడు ప్రమోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సింగ్ వృత్తిలో ఉన్న కేరళ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ప్రేమను నిరాకరించడంతోనే యాసిడ్ దాడి చేశాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 326 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. ఈనెల 10న ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు జిషషాజిపై నిందితుడు యాసిడ్‌తో దాడి చేయడంతో గాయపడింది. నిందితుడు కేరళకు చెందిన ప్రమోద్‌గా పోలీసులు గుర్తించారు. వీరిరువురికీ గతంలోనే పరిచయం ఉన్నట్లు సీపీ తెలిపారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. పెళ్లి చేసుకునేందుకు బాధితురాలు అంగీకరించకపోవడం వల్లే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.




