Friday, 6 November 2026

గుంటూరు మార్చ్‌కు అనుమతించాలి

విశాఖపట్టణం,మే15(జ‌నం సాక్షి): గుంటూరులో నిర్వహించేబోయే దళితుల మిలియన్‌ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతివ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్‌, జగన్మోహన్‌ రెడ్డిలకు అనుమతిస్తారు, దళితుల మిలియన్‌ మార్చ్‌కు మాత్రం ఎందుకు అనుమతివ్వరని హర్షకుమార్‌ ప్రశ్నించారు. ఇది కూడా దళితులను అవమానించడమే అవుతుందని అన్నారు. దళితులకు ఓ న్యాయం,ఇతరులకు ఓ న్యాయం ఉండదన్నారు.