(జనంసాక్షి) జూలై 16
కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజా వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ టెలికం కాలనీ ఖానాజిగూడ లో యూజీడి పనులను మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో త్వరగా పనులుపూర్తి చేయాలని కాంట్రాక్టర్లు ఆదేశించారు. కాలనీలలో వర్షపు నీరు మురుగునీరు ఎక్కడ నిలవకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్అధికారులు ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు భాస్కరరావు, జనరల్ సెక్రెటరీ అనంతుల సంతోష్, ఈఎస్ లక్ష్మణ్, అనిల్, మోసిన్, ప్రభాకర్, ఈశ్వర్ గౌడ్, షేక్ షబ్బీర్, జమిందార్, మురళి, జనార్ధన్, కుట్టి, లోకేష్, సతీష్, కల్పన, లక్ష్మి, ఉదయ, రమ, స్వప్న, కాలనీవాసులు రమణారెడ్డి, సందీప్, మీనా, నందు, సుజాత, కన్న, సత్యనారాయణ గౌడ్, మురళి, లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




