యుద్ధ‌ప్రాతిప‌దిక‌న అప్రోచ్ రోడ్లకు మ‌ర‌మ్మ‌త్తులు

నిర్మ‌ల్ నుంచి క‌డెం వ‌ర‌కు ప్రారంభమైన రాక‌పోక‌లు
మంత్రి. అల్లోల
  నిర్మల్ బ్యూరో, జులై15,,జనంసాక్షి,,,   భారీ వ‌ర్షాల కార‌ణంగా నిర్మ‌ల్ నుంచి మంచిర్యాల‌కు వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై ప‌లు చోట్ల అప్రోచ్ రోడ్లు కొత‌కు గురై రాక‌పోక‌లు నిలిచి పోగా… యుద్ధ‌ప్రాతిప‌దిక‌న   మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టి అప్రోచ్ రోడ్ల‌ను పున‌రుదద్ధిరించిన‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. నిర్మ‌ల్ నుంచి మంచిర్యాల‌కు వెళ్ళే ర‌హ‌దారిలో ప్ర‌ధానంగా మూడు చోట్ల అప్రోచ్ రోడ్లు పూర్తిగా దెబ్బ‌తిన‌గా రెండు చోట్ల మ‌ర‌మ్మ‌త్తులు పూర్తైన‌వ‌ని, దీంతో నిర్మ‌ల్ నుంచి క‌డెం వ‌ర‌కు బ‌స్సులు, ట్రాక్ట‌ర్లు, ఆటోలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌ రాక‌పోక‌ల‌కు అనుమ‌తినిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. భారీ వాహ‌నాల‌కు (లారీలు, ట్రక్కులు) ప్ర‌స్తుతానికి అనుమ‌తిన‌వ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌రిగ‌తిన పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ ఎజెన్సీని, ఆర్ అండ్ బీ అధికారుల‌ను మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు.
Attachments area