హైదరాబాద్ : అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో దారుణం జరిగింది. పోలీసులు అత్యుత్సాహాసం ప్రదర్శించారు. విచక్షణను కోల్పోయారు. ఓ కేసు విచారణ కోసం దళిత యువకుడిని అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని, చితకబాదారు. అంబర్‌పేట గోల్నాక లంకబస్తీకి చెందిన సాయికుమార్‌ను ఓ గొడవ విషయంలో అంబర్‌పేట పీఎఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికుమార్ ను చావబాదారు. పోలీసుల దెబ్బలకు అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. సాయికుమార్ కు ఇప్పుడు నడవలేని పరిస్థితి నెలకొంది. పాతకక్షల్ని మనసులో పెట్టుకున్న పోలీసులు.. తనను 3గంటలపాటు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని సాయికుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం చేయాలని సాయికుమార్ డిమాండ్ చేస్తున్నాడు. తన కొడుక్కి న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు అంబర్‌పేట పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని..అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని పోలీసులు తెలిపారు




