యువకుడి ఆత్మహత్య

సూర్యాపేట,మే31(జ‌నం సాక్షి):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానిచెందిన వడ్డెంపూడి భాను(22) అనే యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయమంతా స్నేహితులతో సరదాగా గడిపిన భాను రాత్రి ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.