యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తన పట్ల యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్ పాటిల్, జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలో స్మృతి ఇరానీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో సోనియా గాంధీ ని ఉద్దేశించి చుట్టుముట్టి అనుచితంగా ప్రవర్తిస్తూ, వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కక్షసాధింపు చర్యల్లో భాగంగా సోనియా గాంధీ ని ఈడీ విచారణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వజహీద్, యువజన  నాయకులు  మల్లన్న, ఖాదర్, రామచందర్ రెడ్డి, తేజ, పాండు,  అనంతరాం, నిజాం, సోహైల్ పాటిల్, అమన్, శ్రీకాంత్ రెడ్డి, మొయిజ్, ఇబ్రహీం, ఉమాకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు