– టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
– ఏ సి డి పి నిధులనుంచి రెండు బీసీ కమ్యూనిటీ హాల్స్, రెండు ఎస్సీ కమ్యూనిటీ హాల్స్
చౌడాపూర్, ఆగస్టు 01( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు బీసీ కమ్యూనిటీ హాల్స్ మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి యొక్క ఏ సి డి పి నిధుల నుంచి రూ. 20 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కోసం కేటాయించడం జరిగింది. ఇట్టి కమ్యూనిటీ హాల్స్ కోసం మండల కేంద్రంలోని మందిపాల్ గ్రామంలో ఆదివారం రోజు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం మండల టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేయడం జరిగింది. చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం యువజన సంఘాలను ప్రోత్సహిస్తూ అందులో భాగంగా కమ్యూనిటీ హాల్స్ కోసం నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయం అని కొనియాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబార్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ మాట్లాడుతూ.. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి యొక్క ఏసీడీపీ నిధుల నుంచి మందిపల్ మరియు కన్మాన్ కాల్వ గ్రామాలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాందాస్ నాయక్,సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజు, చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నరసింహులు, మందిపల్ ఎంపిటిసి తనయుడు శంకర్, టిఆర్ఎస్ యువ నాయకులు మఠం రాజశేఖర్,చౌడాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు అశోక్, మండల ప్రధాన కార్యదర్శి కుమార్, శివకుమార్, మొగులయ్య, నరసింహులు, బన్నీ, కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.




