యువత ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి.
-బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి.
పోటో: అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఆర్డీవో.
బెల్లంపల్లి,సెప్టెంబర్13,(జనంసాక్షి)
ఓటు హక్కుపై యువత అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటు అనే ఆయుధంపై యువత పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొని, ఓటు హక్కును కలిగి ఉండాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ దేశ భవిష్యత్తును మారుస్తుందని, యువత ఇవన్నీ గమనించి ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ కుమార స్వామి, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.