Wednesday, 4 November 2026

యువత క్రీడల్లో రాణించాలి

అలియా బాద్ సర్పంచ్ గుర్క కుమార్ యాదవ్ : శామీర్ పేట, జనం సాక్షి :స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం రోజు అలియాబాద్ గ్రామంలో ఖోఖో,కబడ్డీ,వాలీబాల్ పోటీలను అలియాబాద్ గ్రామ సర్పంచ్ గుర్క కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మైదానంలో నిర్వహించారు.క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుందని,ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని,వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని,విద్యార్థులకే కాకుండా యువకులకు కూడా చేయూత అంది స్తున్నామని అందులో భాగంగానే యువకులతో క్రీడలు ఏర్పాటు చేసినట్టుగా సర్పంచ్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమార్ యాదవ్,ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,వార్డు , గ్రామంలోని యువకులు, తదితరులు పాల్గొన్నారు.
18ఎస్పీటీ -1: వాలీబాల్ పోటీలను ప్రారంభస్తున్న సర్పంచ్ కుమార్ యాద