Wednesday, 4 November 2026

యువ దర్శకుడు విప్లవ్ కోనేటి మృతి

హైదరాబాద్:అనారోగ్యం కారణంగా యువ దర్శకుడు విప్లవ్ కోనేటి(33) మంగళవారం రాత్రి మరణించారు. విప్లవ్ ఎంబీబీఎస్ పూర్తి చేసినా.. సినీమాల మీద ఉన్న ఆసక్తితో ఈ రంగంలో ప్రవేశించారు. జగపతిబాబు హీరోగా నటిస్తున్న హితుడు చిత్రానికి విప్లవ్ కోనేటీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కోటీ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. కోనేటి అకాల మరణంతో సినిమా యూనిట్ దిగ్భాంతికి గురైంది. నటి ఆర్తిఅగర్వాల్ మరణించిన రెండు రోజులకే  ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సినీవర్గాలు విచారం వ్యక్తంచేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *