*యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దందెర రాజేందర్*
*పలిమెల, జులై 23 (జనంసాక్షి)* నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించే యూత్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి యూత్ కాంగ్రెస్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పలిమెల మండల యూత్ అధ్యక్షుడు దందెర రాజేందర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు పాల్గొంటారని అన్నారు. అదేవిధంగా విశిష్ట అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత ప్రకాష్ పాల్గొంటారని తెలిపారు. మండలంలోని పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.




