యూత్ జోడో బూత్ జోడో శిక్షణ శిబిరం.
ఫొటో : పాల్గొన్న కాంగ్రెస్ యూత్ నాయకులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం యూత్ జోడో, బూత్ జోడో కార్యక్రమంపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, శివసేన రెడ్డి, మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆదేశాలు మేరకు యూత్ జోడో బూత్ జోడో బెల్లంపల్లి నియోజకవర్గ శిక్షణ శిబిరం నిర్వహించినట్లు వివరించారు. పోలింగ్ బూత్ కు ఐదుగురు యువకులను ఎన్రోలర్స్ ను ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, యూత్ జోడో బూత్ జోడో నియోజకవర్గ ఇంచార్జి విలాస్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకులు పోచంపల్లి హరీష్, అచ్ఛ శివాజీ, ఎలుక ఆకాష్, శ్రావణ్ బోగ్గ, రాకేష్, సాయి సమంత, ప్రదీప్, శశి, కిరణ్, గట్టేష్, నాగేంద్రబాబు ,వెంకట్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
యూత్ జోడో బూత్ జోడో శిక్షణ శిబిరం.




