హైదరాబాద్ : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ… రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతుంటే ఆర్థిక మంత్రి చిదంబరం బంగారం కొనుగోలు చేయవద్దంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడంలో చిదంబరం విఫలమయ్యారని విమర్శించారు. ఎస్‌డీఏ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళితే… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మరోసారి సంక్షోభంలోకి నెడుతోందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల వృద్ధిని పెంచకపోవడం వల్ల దిగుమతుల సుంకాన్ని అధికంగా మోయాల్సి వస్తుందని మురళీధర్‌రావు తెలిపారు. దేశీయ ఉత్పత్తి, మార్కెట్‌కు ప్రోత్సాహాలు కరువయ్యాయని, ప్రభుత్వం వెంటనే రూపాయి విలువ ఇంకా పడిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరారు.




