Wednesday, 4 November 2026

యూపీ మాజీ గవర్నర్‌ సత్యనారాయణరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ బి. సత్యనారాయణరెడ్డి (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మండలం అన్నారంలో సత్యనారాయణ 1927 ఆగస్టు 21న జన్మించారు. 1990-93 మధ్య యూపీ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలకు స్వల్ప కాలం గవర్నర్‌గా సేవలు అందించారు. 1978లో జనతా పార్టీ తరపున, 1984లో తెలుగు దేశం పార్టీ తరపున రెండు సార్లు రాజసభకు పాతినిధ్యం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *