బాల్కొండ జులై 1 (జనం సాక్షి ) ఇంటి నుండి బయటకు వెళ్లన యువతీ అదృశ్యమైన ఘటన బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, బాల్కొండ ఎస్సై కే. గోపి తెలిపిన వివరాలా ప్రకారం, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన జోషి రాజేశ్వరి (22) జూన్ 27 వ తేదీన హైదరాబాద్ వెలుతున్నానని చెప్పి కిసాన్ నగర్ నుండి బయలుదేరి వెళ్ళింది, అనంతరం తిరిగి ఇంటికి రాలేదు, దీంతో శుక్రవారం బాల్కొండ పోలీస్ స్టేషన్ లొ అమ్మాయి తండ్రి శంకర్ రావు జోషి పిర్యాదు చేశారు, ఈ పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్లు బాల్కొండ ఎస్సై కే. గోపి తెలిపారు
యూవతి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు




