*రంగక్కకు సన్మానం.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పెంచికల్ దిన్న గ్రామపంచాయతీ కార్యాలయంలో కొంజేటి సత్యవతి అలియాస్ రంగక్క కు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం తెలంగాణలో నైజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో పెంచికల్ దిన్న గ్రామానికి విశిష్టమైన చరిత్ర ఉందని 15 మంది కి పైగా ఆనాటి పోరాటంలో పాల్గొని కొందరు వీరమరణం పొందారాన్నారు.ఆనాటి చరిత్రకు గుర్తుగా మిగిలిన రంగకకు  సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకర వాణి శ్రీరామ్ మూర్తి,ఎంపిటిసి ఎల్లబోయిన లింగయ్య, మాజీ సర్పంచులు మర్రి నాగేశ్వరరావు,సుంకర క్రాంతి కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,హరీష్,ఎల్లయ్య సీతారాములు,తదితరులు పాల్గొన్నారు