* తహశీల్దార్ విజయలలీత
* యస్ ఐ సురేందర్ రెడ్డి
వీర్నపల్లి ఏప్రిల్30(జనంసాక్షీ):-
వీర్నపల్లి మండలంలోని రంగంపేట గ్రామంలో మండల తహశీల్దార్ టి విజయ లలిత యస్ఐ సురేందర్ రెడ్డి అద్వర్యం లో సివిల్ రైట్స్ డేను గ్రామ సర్పంచ్ సుతారి మల్లవ్వ అద్యక్షన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు ఉండకూడదని సమాన పని సమాన వేతనం ఉండాలన్నారు. మన బతుకులు మారాలంటే చదువు మాత్రమే
సహాకరిస్తుందని మన పిల్లలను బాగాచదివించి
ఒక ఉన్నత స్తానం లో ఉంచితే మన బ్రతుకుల మారిపోతుందన్నారు. దానికి ఉదాహరణ డాక్టర్ బి. అర్ అంబెడ్కర్ గారు అతను ఎంత అవమానాలు అనుభవించి ఎంతో కష్టపడి చదువుకోని దళిత బహుజను బ్రతుకు లు మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచాడు.యస్ఐ గారు మాట్లాడుతూ ఎవరికైన అవమాన జరిగితే రాజ్యాంగ ఇచ్చిన హక్కు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని,అలాంటి పనులను చేయకూడదని అన్నారు ఈ కార్యక్రమంలోఏడ్ల మనమ్మ,నాయబ్ తహశీల్దార్ జయంత్ వి అరో ఒ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రంగపేట గ్రామంలో సివిల్ రైట్స్ డే




